ఏపీలో కొత్త జిల్లాల లిస్టు ఇలా ఉండబోతుంది..!!


ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పరిపాల‌నా సౌల‌భ్యంతో పాటు ప్ర‌జ‌ల‌కు అధికారులు ద‌గ్గ‌ర‌గా ఉంటార‌న్న భావ‌న‌తో జిల్లాల విభ‌జ‌న‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీ ఏర్ప‌డ్డాక న‌వ్యాంధ్ర‌లో కొత్త‌గా రంప‌చోడ‌వ‌రం కేంద్రంగా అల్లూరి సీతారామ‌రాజు మ‌న్యం జిల్లాను ఏర్పాటు చేయాల‌ని చూసినా అది జ‌ర‌గ‌లేదు. ఏపీలో క‌లిసిన ఏడు విలీన‌మండ‌లాల‌తో పాటు తూర్పు మ‌న్యంలోని మండ‌లాల‌తో ఈ జిల్లా ఏర్పాటు చేయాల‌ని చూశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త‌గా ఏపీలోని 13 జిల్లాల‌ను 27 జిల్లాలుగా మార్చాల‌న్న ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తున్నాయి. ఈ కొత్త జిల్లాల విభ‌జ‌న ఇలా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.
★ శ్రీకాకుళం: 1-శ్రీకాకుళం, 2-పాలకొండ
★ విజయనగరం: 3-విజయనగరం, 4-పార్వతీపురం
★ విశాఖ‌ప‌ట్నం: 5-విశాఖ‌ప‌ట్నం, 6-అర‌కు, 7-అన‌కాప‌ల్లి
★ తూర్పు గోదావ‌రి: 8-కాకినాడ‌, 9-అమ‌లాపురం, 10- రాజమండ్రి
★ ప‌శ్చిమ గోదావ‌రి: 11-భీమ‌వ‌రం, 12-ఏలూరు
★ కృష్ణా: 13-విజ‌య‌వాడ‌, 14-మ‌చిలీప‌ట్నం
★ గుంటూరు: 15-గుంటూరు, 16-వినుకొండ‌
★ ప్ర‌కాశం: 17-చీరాల‌, 18- ఒంగోలు
★ నెల్లూరు: 19-నెల్లూరు
★ కర్నూల్: 20-క‌ర్నూల్‌, 21-నంద్యాల‌
★ కడప: 22- క‌డ‌ప‌, 23-రాజంపేట‌
★ అనంతపురం: 24-అనంత‌పురం, 25-హిందూపురం
★ చిత్తూరు: 26-చిత్తూరు, 27-తిరుప‌తి
పై జిల్లాల‌తో పాటు రాజ‌ధాని ప్రాంత‌మైన అమ‌రావ‌తిని కూడా జిల్లాగా చేసి 28వ జిల్లా అమ‌రావ‌తిగా ఏర్పాటు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇది విజ‌య‌వాడ‌, గుంటూరు జిల్లాల ఏర్పాటుకు దీనికి ముడిప‌డి ఉండ‌డంతో ఈ జిల్లా ఏర్పాటు ఎంత వ‌ర‌కు ఉంటుందో చూడాలి. జిల్లాల విభ‌జ‌న ముసాయిదా త్వ‌ర‌లోనే ఓ కొలిక్కి వ‌చ్చే అవకాశం ఉంది..

Post a Comment

0 Comments