కడప ఉక్కుపై త్వరలో శుభవార్త


రాయలసీమ ప్రజల చిరకాల కోరికైనా కడప ఉక్కు పరిశ్రమ ఏఏర్పాటు పై త్వరలో శుభవార్త రానుంది. ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి సృజనాచౌదరీ వెల్లడించారు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి (వాసు) చెప్పారు. కేంద్ర ఉక్కుశాక మంత్రి బీరేంద్ర  సింగ్ తో సృజన చౌదరి గురువారం సమావేశం పై చర్చించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి  బీరేంద్ర అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి సృజన చౌదరి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు తో చెప్పారు.

కడపలో ఉక్కు పరిశ్రమ ఏఏర్పాటు కోసం కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారుఅని కేంద్ర ఉక్కుశాక మంత్రి వివరించినట్లు తెలిపారు. దింతో కేంద్ర ఉక్కుశాక మంత్రి స్పందిస్తూ వెంటనే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మెకాన్ సంస్థ అధికారులను ఆదేశించారు అని చెప్పారు. కావున ఇక కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది అని నెలలోగా శుభవార్త రానుందని వాసు తెలిపారు.

Post a Comment

0 Comments