Story of దేవా అన్నా టిఫిన్ సెంటర్ పులివెందుల

కడప జిల్లా పులివెందుల లో రాజ్యలక్ష్మి సినిమా హాల్ ఎదురుగా ఒక టిఫిన్సెం టర్ ఉంది దేవనందరెడ్డి టిఫిన్ సెంటర్ అందరూ ముద్దు గా దేవా అన్నా అంటుంటారు..

అందులో టౌన్ మొత్తం ఉన్న టిఫిన్ సెంటర్స్ రేట్స్ కన్నా చాలా తక్కువ ఖరీదు కు పూరి దోశ ఇస్తారు.. 6 పూరి కి కేవలం 20రూపాయలు తీసుకుంటాడు టేస్ట్ కూడా బాగుంటుంది..
1 దోశ 6 రూపాయలు గుడ్డు దోశ 14 రూపాయలు తీసుకుంటారు.. ఎందుకన్నా ఇంత తక్కువ తీసుకుంటారు మీరు అంటే ఏమో తమ్ముడు అందరూ రిచ్ ఫామిలీ వాళ్ళు ఉండరు గా 3 పూరి 20రూపాయలు పెట్టి తింటే కడుపు నిండుతుందా చెప్పు కష్టపడేది కడుపు కోసమే గా అందుకే నాకు పెద్ద గా లాభం రాకపోయినా ఈ టిఫిన్ సెంటర్ నడుపుతున్నా ..

ఏ మాట కి ఆ మాట చెప్పుకోవాలి ఫ్రండ్స్ రియల్లీ గ్రేట్ దేవా అన్నా మధ్యతరగతి వారికోసం మంచి పని చేస్తున్నారు.. మీకు వీలైతే ఒక్కసారి వెళ్లి రుచి చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది

Comments




Post a Comment

0 Comments