మెట్రో తోలి మహిళా పైలట్ మన కడప అమ్మాయి


దేశం లోనే తోలి మహిళా లోకో పైలట్ గ మన కడప కు చెందిన గోవిందు గ్రీష్మ ఘనత సాధించారు. YSR కడప జిల్లా మైలవరం మండలానికి చెందిన గోవిందు శంకర్రావు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు, శంకర్రావు అథిమిలో 17 ఏళ్లపాటు పని చేసి రిటైర్ అయ్యారు. మొదటి సంతానమైన గ్రీష్మ 10 వ తరగతి పూర్తికి చేసి తరువాత , కడప మహిళా పాలటెక్నిక్ కళాశాల లో ఎలక్ట్రానిక్ విభాగం లో డిప్లొమా పూర్తీ చేసింది, అనంతరం KSRM ఇంజనీరింగ్ కళాశాలలో 2014  లో బీటెక్ పూర్తిచేసింది. మూడేల కిందట హైదరాబాద్ లో తొలి మహిళా పైలట్ గ ఎంపిక ఐంది. ఈ నెల 25  న మెట్రో ట్రయిల్ రన్ నిర్వహించి అందరి మన్నలను పొందింది. ప్రస్తుతం ప్రమోషన్ పై స్టెయిన్ కంట్రోలర్ గ బాధ్యతలు చేపట్టింది. 


తొలి మెట్రో రైలు సర్వీసుకు లోకోపైలెట్‌గా గిరీష్మ పనిచేసిన విషయం తెలుసుకున్న కడప ప్రభుత్వ పాలిటెక్నిక్‌ అధ్యాపక బృందం, వేపరాల గ్రామ సర్పంచ్‌ కొండయ్య, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.2008 -09లో పదో తరగతి బ్యాచ్‌కు చెందిన గిరీష్మ 515 మార్కులు సాధించి వేపరాల ఉన్నత పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచింది.



Post a Comment

0 Comments