ఆ విషయంలో రాష్ట్రంలోనే నెం.1 కడప!

  • రాష్ట్ర నేరాల్లో కడప ఫస్ట్‌
  • రాష్ట్ర నేర గణాంకాల నివేదిక 2017 వెల్లడి
  • రోజుకు సగటున 36 కేసులు
  • ఆస్తుల రికవరీ 50 శాతమే
  • కోర్టుల్లో ఛార్జిషీట్‌ దాఖలు

జిల్లాలో గంటకో ఒక నేరం.. ఘోరం జరుగుతోంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, క్రికెట్‌ బెట్టింగ్‌, పేకాట తదితర క్రైం వ్యవహారాలపై రోజుకు 36 వరకు పోలీసుస్టేషన్‌లలో కేసులు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 2016 కన్నా 2017లో 18 శాతం నేరాల సంఖ్య పెరగడం కొంత ఆందోళన కలిగించే అంశం. దోపిడీలు, దొంగతనాలకు సంబంధించి రికవరీలో 50 శాతం దాటడం లేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసులపై చాలా వరకు కోర్టుల్లో ఛార్జిషీట్‌లు వేసినా సాక్ష్యాలు చూపడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు గురువారం మంగళగిరిలో రాష్ట్ర నేర గణాంకాల నివేదిక-2017ను విడుదల చేశారు. ప్రతి లక్ష మంది జనాభాకు నేరాల సంఖ్యను నేరాల రేట్‌గా పరిగణించి రాష్ట్ర నేరాల్లో కడప జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లు తేల్చారు.

కడప, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో గత మూడేళ్ల పోలీసు కేసులు నమోదు పరిశీలిస్తే.. ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే వస్తోంది. 2015లో 8605 కేసులు నమోదు కాగా, 2016లో 7437 అంటే కొద్దిగా తగ్గినట్లుగానే కనిపించినా, 2017లో 13,367 కేసులు పోలీసులు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి వరకు 1206 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, ప్రాణాంతకమైన ప్రమాదాలు, గ్యాంబ్లింగ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌లు, బెల్టుషాపుల నిర్వహణ తదితర కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. 2015 గణాంకాలను పరిశీలిస్తే..రోజుకు 24 కేసులు నమోదు అవగా, 2016లో 21, 2017లో 36, 2018లో అంటే మూడు నెలల కాలంలో 13 కేసులే పోలీసులు నమోదు చేశారు. వీటిలో కొన్ని తప్పుడు కేసులు ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Post a Comment

0 Comments