1983 నుండి వై.యస్.ఆర్. కడప జిల్లా - ఒక అభివృద్ధి సమీక్ష

1983 నుండి వై.యస్.ఆర్. కడప జిల్లా - ఒక అభివృద్ధి సమీక్ష 


రామాయణ కాలంలో కిష్కింధ రాజ్యంలో భాగం. శాసనాలలో హిరణ్య నగరమని పేరు. తిరుమలేషుని తొలి గడప కడప గా మారింది. హైదరా బాద్ నిజాములు బ్రిటీష్ వారికి ధారాదత్తం చేసిన దత్త మండలంలో భాగమయింది. దత్త మండలాలలో భాగంగా 1808 లో కడప జిల్లాగా రూపుదాల్చింది. సర్ థామస్ మన్రో తొలి కలెక్టర్. తెలుగు నిఘంటువుకు రూపకల్పన చేసి వేమన పద్యాలను వెలుగు లోకి తెచ్చిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఈ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. బ్రిటీష్ వారు కడపను Cuddapah వ్యవహరించారు. 19.08.2005 న Cuddapah ను స్థానిక వ్యవహారికం (కడప) Kadapa గా అధికారికంగా మారింది. ఆకస్మిక మరణం చెందిన జిల్లాకు చెందిన మహనీయుడి పేరు మీదుగా వై.యస్.ఆర్. కడప జిల్లాగా ఆయన జన్మదినం 2010 జులై 8 నుండి అమలు లోకి వచ్చింది.

భౌగోళికంగా ఉత్తరాన నల్లమల కొండలు, తూర్పు- దక్షిణాన శేషాచలం కొండల్లో విలీనమయ్యే పాలకొండల సోయగాలతో అలరారు తున్నది. పాలకొండల విచ్ఛిన్న శ్రేణులు పశ్చిమాన ఉన్నాయి. జిల్లా ఉత్తర భాగంలో ప్రముఖ పెన్నానది ప్రవహిస్తుండగా దానికి ఉపనదులుగా ఉత్తరం నుండి కుందూ నది, దక్షిణం వైపు నుండి చిత్రావతి, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు(బహుదా) నదులు ప్రవహిస్తున్నాయి. ఫించా, మాండవ్య లాంటి చిన్న చిన్న నదులు, వంకలు అనేకం ఉన్నాయి. నల్లరేగడి, ఎర్ర ఇసుక నేలలు జిల్లా లో విస్తరించి ఉన్నాయి. రాయల సీమకు కేంద్ర బిందువుగా భాసిల్లుతోంది. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో ఇతర రాష్ట్రాలతో కానీ, సముద్ర తీరప్రాంతంతో కానీ సరిహద్దు లేని ఏకైక జిల్లా వై.యస్.ఆర్. కడప జిల్లా.

రెండు లోక్ సభ, పది అసెంబ్లీ నియోజక వర్గాలతో, మూడు రెవిన్యూ డివిజన్లు, 51 మండలాలు, 896 రెవిన్యూ గ్రామాలతో సుమారు 30 లక్షల జనాభాతో జిల్లా కూడి ఉంది. అక్షరాస్యత సుమారు 70 శాతం.

రేనాటి చోఢ ధనుంజయ వేయించిన తొలి, మలి తెలుగు శాసనాలుగా పేరొందిన కలమళ్ళ, ఎఱ్ఱగుడిపాడు(తొలి గద్య శాసనం) ఎఱ్ఱగుంట్ల మండలం లోని ఆయా గ్రామాల చెన్నకేశవ ఆలయాలలో వెలిశాయి. పులివెందుల నియోజక వర్గం చక్రాయ పేట మండలంలోని సురభి గ్రామం వనారస గోవిందరావు స్థాపించిన సురభి నాటకాల పుట్టినిల్లు. అష్టదిగ్గజ అల్లసాని పెద్జన, అయ్యలరాజు రామ భద్రుడు, యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మం, తాళ్లపాక అన్నమయ్య మరియు తిమ్మక్క, తొలి తెలుగు కవయిత్రి  మొల్ల, మొll వారు ఈ జిల్లా వాసులు. స్వాతంత్ర పోరాట గాడిచర్ల హరి సర్వోత్తమ రావు, కడప కోటిరెడ్డి, సినీ దిగ్గజ నాగిరెడ్డి,  హస్యనట పద్మనాభం మొll ప్రముఖులకు గడప ఈ కడప. 

Post a Comment

2 Comments

  1. Great poeats and marvelous humanity
    Is there in this soil.

    ReplyDelete
  2. మంచితనం,మానవత్వం, నమ్మితే ప్రాణాలైనా ఇవ్వడం,ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు మా కడపజిల్లా సొంతం .

    ReplyDelete